హైదరాబాద్‌కు అతి దగ్గర్లో అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయని మీకు తెలుసా. కేవలం నగరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కేవలం వాటర్ ఫాల్స్ మాత్రమే కాకుండా ట్రెక్కింగ్ అనుభూతిని కూడా పొందొచ్చు. కొండలు, జలపాతం, పచ్చని ప్రకృతితో హైదరాబాద్‌కు సమీపంలోనే ఒక ప్రశాంతమైన ప్రాంతం ఉంది. హైదరాబాద్‌లో ఉండే ఐటీ ఉద్యోగులు, నగరవాసులు.. ఒకేరోజులో వెళ్లి.. ఆ ప్రకృతిని ఆస్వాదించి వచ్చేందుకు బెస్ట్ ప్లేస్‌గా నిలుస్తోంది.