హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరా ఫాతిహా చదవాలని హోంవర్క్ ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్కూల్ యాజమాన్యం స్పందించి సంబంధిత టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. హిందూ సంస్కృతిపై దాడిగా అభివర్ణించారు.