హమ్మయ్య నైరుతి వచ్చేస్తోంది.. ఇక తెలంగాణలో వర్షాలే వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

1 month ago 10
తీవ్ర ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు నైరుతి రుతుపవనాల రాకతో పెద్ద ఉపశమనం లభించింది. ఎల్‌నినో ప్రభావంతో ఆలస్యమవుతుందనుకున్న రుతుపవనాలు వేగంగా కదులుతూ రాష్ట్రాన్ని తాకనున్నాయి. దీని ప్రభావంతో శనివారం తాండూరు, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జూన్ 10 వరకు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీల వరకు తగ్గనున్నాయి.
Read Entire Article