తెలంగాణలో సంచలనం సృష్టించిన అండాల అక్రమ సేకరణ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేయగా.. వాటి నిర్వాహకులు కమిషన్ ఎదుట హాజరై వివరాలు సమర్పించారు. అండాల సేకరణలో చట్ట నిబంధనలు, మహిళల అంగీకారం, ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించారా అనే అంశాలపై అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు.