దీపావళి పండుగను పురస్కరించుకుని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉచితంగా వెండి నాణేల పంపిణీ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మొదలైన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి భారీ స్పందన వస్తోంది. గుల్జార్ హౌస్ వరకు సుమారు 500 మీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. రద్దీని నియంత్రించేందుకు ఆలయ కమిటీ నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా, చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ పంపిణీ ఈ నెల 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది.