రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర SI.. ఇప్పటికే అవినీతి కేసులో SI, CI అరెస్ట్

1 day ago 2
కీసర పోలీస్‌ స్టేషన్‌లో మరో లంచం ఘటన చోటుచేసుకుంది. రెండు కేసుల్లో చార్జిషీట్లు త్వరగా దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేసి పట్టుకున్నారు. గతంలో ఇదే స్టేషన్‌కు చెందిన సీఐ, ఎస్‌ఐ రూ.5 లక్షల లంచం వ్యవహారంలో అరెస్ట్ కావడం గమనార్హం. వారి అరెస్టు సమయంలో కీసర, బోగారం ప్రాంతాల స్థానికులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గత ఘటనపై చర్చ కొనసాగుతుండగానే మరో అధికారి ఏసీబీకి చిక్కడం కీసర పోలీస్‌ స్టేషన్‌లో వరుసగా బయటపడుతున్న అవినీతి ఆరోపణలను మరోసారి తెరపైకి తెచ్చింది.
Read Entire Article