సంక్రాంతికి సొంతూరికి వెళ్లి తిరిగొస్తున్నారా.. ప్రయాణాలు అప్పుడే పెట్టుకోండి..

6 months ago 22
సంక్రాంతి పండుగ పూర్తి కావటంతో సొంతూరుకి వెళ్లిన జనం తిరిగి నగరబాట పడుతున్నారు. దీంతో రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. మరీ ముఖ్యంగా విజయవాడ- హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. అయితే ప్రయాణ సమయంలో వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పొగమంచు తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయం ఎనిమిది గంటల వరకూ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం 8 తర్వాత ప్రయాణాలు పెట్టుకోవడం మంచిదని సూచించింది. ఏపీలో ఆరు జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది.
Read Entire Article