సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో తెలంగాణలోని అన్ని జిల్లాలు, గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తనకు దేవుడు అన్ని రాజకీయ పదవులూ ఇచ్చాడని.. ప్రజలకు తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. పాలమూరు ప్రాంతంలో వలసలు, సాగునీటి ప్రాజెక్టుల ఆలస్యంపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారం, ఉద్యోగుల జీతాల చెల్లింపులపై కూడా వ్యాఖ్యలు చేశారు.