తెలంగాణలో జనగణన రెండో విడత నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. జనవరి 10 నుంచి 24 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. జనవరి 25 నుంచి జనగణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జనాభా లెక్కలు సేకరిస్తారు. అనంతరం మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహిస్తారు. ఈ మేరకు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర గెజిట్‌లో పునఃప్రచురిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 155ను జారీ చేసింది. తొలి విడతలో ఇళ్ల గణన ఇప్పటికే పూర్తికాగా.. రెండో విడత కోసం సిబ్బంది నియామకం, శిక్షణ, ఇతర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.