నేరుగా మిల్లర్ల నుంచే బియ్యం.. రూ.66కే కిలో బియ్యం, ధరల పెంపుపై సర్కార్ సీరియస్‌

1 hour ago 1
తెలంగాణలో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం రకాలను బట్టి కిలో గరిష్ట విక్రయ ధరలను రూ.66 నుంచి రూ.79 వరకు నిర్ణయించింది. బియ్యం కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించింది. రిటైలర్లు నేరుగా మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేయవచ్చని తెలిపింది. నకిలీ ఎమ్మార్పీ స్టిక్కర్లు, తూకంలో మోసాలు, అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌పై తనిఖీలు చేపట్టనుంది. పదేపదే అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని అధికారులు హెచ్చరించారు.
Read Entire Article