స్టీల్‌ప్లాంట్ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ప్రభుత్వా్న్ని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ సీఎండీ సహా ఇతర ఉన్నతాధికారులపై కేసులు నమోదుచేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విదేశాలలో ఇలాంటి ఘటనలు జరిగితే భారీ జరిమానాలు విధిస్తారని.. బాధితులకు కూడా భారీ మొత్తంలో పరిహారం అందిస్తారని బొలిశెట్టి సత్యనారాయణ వివరించారు.