గంజాయి క్వీన్, లేడీ డాన్ నీతూబాయి మరోసారి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుపోయింది. గతంలో అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించినా.. మళ్లీ బయటికి వచ్చి గంజాయి దందా చేస్తూనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోగా.. తాజాగా మరోసారి తృటిలో చేజారినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈగల్ ఫోర్స్ చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 50 మంది ఐటీ ఉద్యోగులు పట్టుబడ్డారు. రోజూ రూ. 5 నుంచి రూ.10 లక్షల గంజాయి అమ్మకాలు సాగుతున్న విచారణలో తేలింది.