మహిళా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీసీ బస్సులలోనూ శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతోంది. ఈ విషయంపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ రాసిన లేఖకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ దిశగా కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రాయపాటి శైలజ ఎక్స్ వేదికగా వెల్లడించారు.