విధివిధానాలు వచ్చే వరకు ఆగాల్సిందే.. హైడ్రా కూల్చివేతలకు హైకోర్టు బ్రేక్

3 months ago 18
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దిష్టమైన మార్గదర్శకాలు, ప్రామాణిక కార్యాచరణ విధానం సమర్పించే వరకు ఎలాంటి బలవంతపు కూల్చివేతలు చేపట్టరాదని ఆదేశించింది. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో నోటీసులు లేకుండా జరిగిన కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి.. హైడ్రా తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయితే చెరువులు, నాలాల రక్షణకు చేపట్టే చర్యలకు మినహాయింపునిస్తూ నివాస గృహాల విషయంలో నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.
Read Entire Article