Vijayawada Durga Temple Ghat Road Close: విజయవాడ శ్రీకనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డును మూసివేశారు. రోడ్డు మరమ్మతు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రిపైకి వెళ్లాలంటే.. కనకదుర్గ నగర్ మార్గం వైపు నుంచి వెళ్లాలని సూచించారు.మెట్ల మార్గం, లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయ ఈవో సూచించారు.