విజయవాడ: ఏసీపీ ఉంటున్న అపార్టుమెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు!

2 months ago 10
విజయవాడలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఏసీపీ సత్యానందం ఉంటున్న ప్రత్యూష అపార్టుమెంట్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి అపార్టుమెంట్ గోడ కూలి.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగింది ఏసీపీ సత్యానందం ఇంట్లోనే అని సమాచారం. అయితే ఘటన జరిగిన సమయంలో సత్యానందం ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను నియంత్రించారు.
Read Entire Article