వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ నేషనల్ హైవే మూసివేత..

6 months ago 22
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా తాత్కాలికంగా అనుమతినిచ్చినప్పటికీ.. మితిమీరిన వేగం, పొగమంచు వల్ల వరుస ప్రమాదాలు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కల్లూరు వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం ఆందోళన కలిగించింది. అసలు ఈ హైవేపై ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద బారికేడ్లు వేసి రాకపోకలను అడ్డుకుంటున్నారు. పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి పనులు పూర్తయి... అధికారికంగా ప్రారంభించిన తర్వాతే వాహనాలను అనుమతిస్తామని నేషనల్ హైవే అథారిటీ ప్రకటించింది.
Read Entire Article