లక్షా 60 వేల మంది ఓటర్లు ఉన్న తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ స్వల్ప తేడాతో గెలుపొందింది. చెవిరెడ్డి భాస్కర రెడ్డి చిన్న కొడుకు 602 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ధనలక్ష్మిపై గెలుపొందారు. ఈ ఎన్నికల ఫలితంపై టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి స్పందించారు. తాము రీకౌంటింగ్‌కు వెళ్దామని భావించామని.. అయితే ఈ ఎన్నికల్లోనూ ఓడితే డిప్రెషన్లోకి వెళ్తామని చెవిరెడ్డి బతిమాలారని అందుకే వదిలేశామన్నారు.