వాహనదారులకు తెలంగాణ రవాణాశాఖ తీపి కబురు చెప్పింది. మూడు కీలక సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. వాహన యాజమాన్య బదిలీ, ఇతర రాష్ట్రాలకు వాహనం తరలించేందుకు ఎన్‌ఓసీ, యజమాని ఈ-కేవైసీ అప్‌డేట్‌ను వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా పొందవచ్చు. ఆధార్ ఓటీపీతో గుర్తింపు ధ్రువీకరణ చేసి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.