కార్తిక మాసం సందర్భంగా నవంబరు 10 నుంచి డిసెంబరు 8 వరకు టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర బస్సులు నడపనుంది. గ్రేటర్ హైదరాబాద్ కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి 40 మంది సామర్థ్యంతో బస్సులు ఏర్పాటు చేస్తోంది. వేములవాడ, శ్రీశైలం, యాదాద్రి, పంచారామాలు, అరుణాచలం, హంపి తదితర క్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.