Ramagiri Jowkala Gold Mines: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమలో బంగారు గనుల అన్వేషణలో ఉంది. కర్నూలు జిల్లా జొన్నగిరి, చిత్తూరు జిల్లా కుప్పంలో బంగారు గనుల్ని గుర్తించగా.. శ్రీసత్యసాయి జిల్లా జౌకల, రామగిరి ప్రాంతంలో గనులు ఉన్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పరిశోధనలు చేసి త్వరలోనే స్పష్టతకు రానున్నారు. జౌకల ప్రాంతంలో మొత్తం ఆరు బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం నాలుగు దశల్లో బంగారం నిక్షేపాలపై రీసెర్చ్ చేసి నివేదికను సమర్పించనున్నారు.