మీర్‌పేటలో కారు డ్రైవర్ ఉన్మాదం.. వ్యక్తిని 2 కి.మీ ఈడ్చుకెళ్లి రాక్షసత్వం

1 month ago 9
హైదరాబాద్‌ మీర్‌పేట్ పరిధిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్‌ను ఢీకొట్టిన ఓ ట్యాక్సీ డ్రైవర్.. నిలదీసిన బాధితుడిని ఏకంగా 2 కిలోమీటర్ల మేర కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లి రాక్షసత్వం ప్రదర్శించాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. కుమారుడి రెండు కాళ్లు విరిగి ఆసుపత్రి పాలయ్యాడు. స్థానికులు వెంబడించి నిందితుడిని పట్టుకోగా.. పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
Read Entire Article