Bhogapuram Airport Aerodrome License Update: ఏపీ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా విమానాశ్రయానికి సంబంధించి ఏరోడ్రోమ్ లైసెన్స్ వచ్చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. విమానాలు రాకపోకలు సాగించడానికి వీలుగా ఈ ఏరోడ్రోమ్ లైసెన్స్ జారీ చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు పూర్తిగా.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ కావాల్సి ఉంది.