బాసర ఆర్జీయూకేటీలో అక్టోబర్ 26 నుంచి ఆన్‌లైన్ క్లాసులు.. సవరించిన షెడ్యూల్ విడుదల

1 week ago 12
రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం బాసర క్యాంపస్ 2026–27 విద్యా సంవత్సరానికి సెమిస్టర్‌-1 సవరించిన అకడమిక్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. పీయూసీ-1 నుంచి ఇంజినీరింగ్ చివరి సంవత్సరం వరకు అన్ని బ్యాచ్‌లకు అక్టోబర్ 26 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 10న పీయూసీ విద్యార్థులు, నవంబర్ 18న ఇంజినీరింగ్ విద్యార్థులు క్యాంపస్‌కు చేరుకోవాలి. మిడ్‌టర్మ్ పరీక్షలు నవంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఎండ్‌ సెమిస్టర్, రెమిడియల్ పరీక్షల తేదీలను కూడా యాజమాన్యం ప్రకటించింది. అన్ని పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు.
Read Entire Article