TTD Digital Platforms 17.54 Crore Views: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అలాగే తిరుమలకు రాలేని భక్తులు టీటీడీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా స్వామివారి వైభవాన్ని వీక్షిస్తుంటారు. అయితే టీటీడీ టిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా 54 రోజుల్లో 17.54 కోట్ల వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా శ్రీవారి వైభవానికి విశేష ఆదరణ లభిస్తోంది. అంతేకాదు భక్తులు తిరుమలకు సంబంధించిన సమాచారాన్ని టీటీడీ అధికారిక ఖాతాల ద్వారానే తెలుసుకోవాలని సూచిస్తున్నారు.