బండి భగీరథ్‌కు తప్పని తిప్పలు.. బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టులో తెలంగాణ పోలీసుల వాదనలు

2 hours ago 1
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ ఇవ్వొద్దని తెలంగాణ పోలీసులు హైకోర్టును కోరారు. బెయిల్ మంజూరైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బాధితురాలు మైనర్ కావడం, ఆరోపణలు తీవ్రంగా ఉండటం, ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోక్సో చట్టంలోని కఠిన సెక్షన్లు, బీఎన్‌ఎస్ నిబంధనలు చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 6కు హైకోర్టు వాయిదా వేసింది.
Read Entire Article