తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర పర్యావరణ శాఖ.. ఫార్మా సిటీకి అనుమతులు ఇస్తే.. అందులో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోందని మండిపడ్డారు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.. ఫార్మర్స్ సిటీ తీసుకొస్తామని తేల్చి చెప్పారు.