హైదరాబాద్ పాతబస్తీ మెట్రోరైలు రెండో దశ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 888 ఆస్తులకు గాను 825 ఆస్తులు అంటే 93 శాతం సేకరణ పూర్తయినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. బాధితులకు ఇప్పటికే రూ.820 కోట్ల వరకు పరిహారం పంపిణీ చేశారు. మిగిలిన ఆస్తులలో కొన్ని కోర్టు వివాదాలు, వక్ఫ్ భూముల సమస్యలు ఎల్‌ఏఆర్‌ఆర్‌ఏ పరిధిలో ఉన్నాయి. ఈ మార్గంలోని 105 మత, చారిత్రక కట్టడాలకు ఎలాంటి హాని కలగకుండా పనులు చేపడుతుండటం విశేషం. పనుల పర్యవేక్షణకు టెండర్లు కూడా పిలిచారు.