TSPSC Job Notification 2026: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్సీ 290 ఇంజినీర్ పోస్టుల భర్తీకి మూడు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆర్‌అండ్‌బీ శాఖలో 222 సివిల్, 49 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జూన్ 6 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. పరీక్షలు సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరుగనున్నాయి. ఈ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ ఏడాది మరిన్ని భారీ నోటిఫికేషన్లు ఉంటాయని టీజీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.