ఏపీతో వరుణుడు దోబూచులాడుతున్నాడు. అప్పుడప్పుడూ వర్షాలు కురుస్తున్నా కూడా సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఏపీలో జూలై నెలలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఐదు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలలో లోటు వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. మరోవైపు ఎల్ నినో కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో తక్కువ వర్షపాతం నమోదౌతుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.