Telangana Rains Weather Today: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా సమీపంలో అల్పపీడనం ఏర్పడింది.. అలాగే ద్రోణి కూడా ఏర్పడింది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గురువారం నుంచి వానలు మొదలయ్యాయి.. హైదరాబాద్‌లో కూడా వాన పడింది. శుక్రవారం కూడా తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ వానలతో ప్రజలకు కాస్త ఉపశమనం దక్కింది.. తెలంగాణ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.