Tirumala SV Museum Opened For Devotees From November 16: తిరుమలలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం సందర్శన ట్రయల్ రన్ నవంబర్ 15 వరకు కొనసాగనుంది. ట్రయల్ రన్లోగా టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్ని అనుమతిస్తున్నారు. అలాగే తిరుమల, తిరుపతిలో పని చేసే మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల్ని కూడా అనుమతిస్తున్నారు. టీటీడీ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు, శ్రీవారి సేవకులను అనుమతిస్తున్నారు. వీరందరికి ప్రవేశం ఉచితం. ఈ నెల 16 నుంచి భక్తుల్ని అనుమతిస్తారు.