Tirumala Hyderabad Leven Holdings Donation To TTD: ఇటీవల కాలంలో తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి పేరుతో నిర్వహిస్తున్న ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన సంస్థ భారీ విరాళం అందించింది. టీటీడీ ట్రస్టులకు రూ.1.10 కోట్లు విరాళం అందించారు. ఈ మేరకు డీడీలను టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అలాగే తిరుమలలో పౌర్ణమి గరుడసేవను ఘనంగా నిర్వహించింది టీటీడీ.