గంటల వ్యవధిలోనే మహిళ గుర్తింపు.. విజయవాడ పోలీసులకు నారా లోకేష్ థ్యాంక్స్

6 months ago 24
విజయవాడ పోలీసులకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడలో ఓ మహిళ తప్పిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్ దృష్టికి వచ్చింది. రెండు రోజుల కిందట తన క్లోజ్ ఫ్రెండ్ వాళ్ల అమ్మ తప్పిపోయిందని, ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పోలీసులను ఆదేశించారు. దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులు గంటల వ్యవధిలోనే తప్పిపోయిన మహిళను గుర్తించి, ఆమె కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. దీంతో విజయవాడ పోలీసులకు నారా లోకేష్ థ్యాంక్స్ చెప్పారు.
Read Entire Article