Pulivarthi Sudha Reddy Counter To Chevireddy Bhasakar Reddy: తాము తిరుపతి రూరల్ జెడ్పీటీ ఫలితాలను తారుమారు చేయాలనుకుంటే ఎంతసేపు పడుతుందన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి. తాను చెప్పింది నిజం కాదని చెవిరెడ్డి అన్న కుటుంబం నుంచి చెప్పించాలని.. తాను వీడియోలు చూపిస్తానన్నారు. 1672 చెల్లని ఓట్లు ఉన్నాయని.. వాటిలో తమకు 250 ఓట్లు సరిపోవా అంటూ ఘాటుగా స్పందించారు. ఎన్నికల్ని నిస్పక్షపాతంగా నిర్వహించాలనే తాము ఉన్నామని చెప్పుకొచ్చారు.