కౌశిక్ రెడ్డి అరెస్ట్.. బీఆర్ఎస్ యూత్ ఆందోళనలు..

11 months ago 20
క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను వరంగల్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని, సీఎం రేవంత్ రెడ్డి పాలన విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మంత్రులు ఎవరికి వారు దోచుకుంటున్నారని దయాకర్ రావు విమర్శించారు.
Read Entire Article