కౌంటింగ్‌కు ముందు రోజే గుండెపోటు... చనిపోయాక ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి

2 days ago 4
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఈ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల హవా కనిపిస్తుంది. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవంతో ముందుకు సాగుతున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం‌లో ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించినా.. అక్కడ విషాదం నెలకొంది. జనసేన పార్టీకి చెందిన మహిళా ఎంపీటీసీ అభ్యర్థి ఓట్ల లెక్కింపునకు సరిగ్గా ఒక్కరోజు ముందు గుండెపోటుతో కన్నుమూశారు. ఓట్ల కౌంటింగ్ అనంతరం ఆమె ఘన విజయం సాధించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Entire Article