కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు

2 months ago 12
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలమ్మ శుక్రవారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్‌లోని నివాసంలో అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అత్యవసరంగా గుండెకు స్టెంట్ వేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకొని వైద్యులను అడిగి తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
Read Entire Article