కర్నూలు: స్నేహితుడి పెళ్లిలో వేదికపై కుప్పకూలి యువకుడి మృతి.. వీడియో వైరల్

1 year ago 26
Kurnool Man Died In Wedding Ceremony: కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమాడలో ఓ పెళ్లి వేడుక జరిగింది. వరుడి స్నేహితుడు గుండె పోటుతో చనిపోవడం విషాదాన్ని నింపింది. గోనెగండ్ల మండల బి.అగ్రహారం గ్రామానికి చెందిన చిన్న మాదన్న, జయమ్మ దంపతుల కుమారుడు వంశీకుమార్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. పెనుమాడ గ్రామంలో గురువారం స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి అయ్యాక వరుడి స్నేహితులంతా వేదిక మీదకు వెళ్లి బహుమతి అందజేశారు. అనంతరం ఫొటోలు దిగుతుండగా వంశీకుమార్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పెళ్లింట విషాదం నెలకొంది.
Read Entire Article