Andhra Pradesh Collectorate Employees Rationalization: ఏపీలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో అధికారులు, సిబ్బంది సంఖ్య ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్తగా ఏర్పాటైన రెండు జిల్లాలు సహా మొత్తం 28 జిల్లా కలెక్టరేట్లలో ఒకే రకమైన కేడర్ స్ట్రెంగ్త్ అమల్లోకి తీసుకొచ్చారు.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టరేట్‌కు 85 పోస్టులు మాత్రమే ఉంటాయి. వీటిలో 53 రెగ్యులర్ , 32 ఔట్‌సోర్సింగ్ పోస్టులు ఉంటాయి.