Ap Govt Identity Card For Kumki Elephants: ఏపీ ప్రభుత్వం గతేడాది కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఏనుగులు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని పలమనేరు కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్నాయి. అయితే ఈ ఏనుగులకు రెండు రోజుల క్రితం డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి డెహ్రాడూన్ పంపారు. ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏనుగులకు ఆధార్ కార్డులా ఓ గుర్తింపు కార్డును తగిలించనున్నారు