జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కారు డివైడర్ రైలింగ్‌ను ఢీకొట్టడంతో ఇనుప కంచె కారులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ ఉపేంద్రతో పాటు నేపాల్‌కు చెందిన మరో పది మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.