ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుహ్య ఫలితాలు వెలువడ్డాయి. రాజానగరం నియోజకవర్గం సీతానగరం జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మిపై వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు 2,607 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యూహాలు, స్థానిక రాజకీయ సమీకరణాలు ఈ ఫలితంలో చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే స్వగ్రామం గాదరాడలోనూ జనసేనకు మింగుడు పడని ఫలితాలు వెల్లడయ్యాయి.