Telangana Pesticide Herbicide Online Sales Banned: తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ పరుగు మందుల విక్రయాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. పారాక్వాట్ సహా నిషేధిత పురుగు మందుల్ని ఆన్‌లైన్‌లో విక్రయించొద్దని ఈ కామర్స్ సంస్థను ఆదేశించింది. తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి సంస్థ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. అనంతరం నిషేధిత పురుగు మందుల్ని ఇకపై ఆన్‌లైన్‌లో విక్రయించొద్దని ఆ సంస్థకు సూచించారు.