అమెరికాలో చదుకుంటున్న నల్గొండ యువతి అదృశ్యం కావడం ఆమె కుటుంబంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. 23 ఏళ్ల శ్రీజ బోస్టన్‌లో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఫ్రెండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నెట్‌వర్క్‌లో కనిపించి ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయిందని తండ్రి తెలిపారు. శ్రీజను గుర్తించేందుకు బోస్టన్ పోలీసులు ప్రయత్నిస్తుండగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రంగంలోకి దిగారు.