రాజధాని అమరావతి రైతులకు అలర్ట్. రైతుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివరాల స్టేటస్ తెలుసుకునేందుకు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే ప్రత్యేక క్యూఆర్ కోడ్ విడుదల చేశారు.