Telangana Weather September 26: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

1 month ago 13
Telangana Rains: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నేడు కుమురం భీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా, శుక్రవారం సత్తుపల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలతో రాష్ట్ర సగటు వర్షపాత లోటు 21 నుంచి 16 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ఉష్ణోగ్రతలు 34–36 డిగ్రీలకు చేరవచ్చునని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అక్టోబర్ తొలి వారంలో దక్షిణ తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు.
Read Entire Article