ఏపీకి మరో భారీ ప్రాజెక్టు రానుందా అంటే అవుననే వినిపిస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని భావించిన మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ ఇప్పుడు ఏపీవైపు దృష్టి సారించినట్లు సమాచారం. తూత్తుకుడి ప్రాజెక్టు కోసం తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే ఆ తర్వాత తమిళనాడు సర్కారు నుంచి సరైన స్పందన లేకపోవటంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఏపీలో రూ.29 వేల కోట్లు పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.