Macherla ASI: ఏకాంతంగా ఉన్న జంటల వీడియోలు తీసి బెదిరింపులు.. ఏఎస్ఐ సస్పెండ్..

3 months ago 18
పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్ఐ శ్రీనివాస్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఏకాంతంగా ఉన్న ప్రేమజంటల వీడియోలు తీసి.. వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని మాచర్ల ఏఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి. అలాగే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించారు. మాచర్ల ఏఎస్ఐ వ్యవహారంపై విచారణ జరిపించారు. ఈ విచారణలో ఏఎస్ఐ వీడియోలు తీసి బెదిరించటంతో పాటుగా మహిళలు, యువతులను వేధిస్తున్నట్లు తేలింది. దీంతో మాచర్ల ఏఎస్ఐ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ.. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article