HYD: నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఫ్లాట్లు.. నవంబరు 3న లక్కీ డ్రా

4 days ago 8
హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ పరిధిలోని ముషీరాబాద్‌, ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట, గోషామహల్‌ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల కేటాయింపునకు నవంబరు 3న లాటరీ నిర్వహించనున్నారు. గతంలో 16 నియోజకవర్గాల్లో కేటాయించిన ఫ్లాట్లలో అనర్హత, డబ్బుల చెల్లింపుల వంటి కారణాలతో రద్దయిన వాటికి నవంబరు 4న మాప్‌ అప్‌ లాటరీ తీయనున్నారు. రెండు ప్రక్రియలనూ ఆన్‌లైన్‌లో నిర్వహించి యూట్యూబ్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ తెలిపారు.
Read Entire Article